ద్విచక్ర వాహనాలు ఢీ – ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాలు ఢీ – ఒకరి మృతి

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 11:47 AM

మైనర్‌ బాలునికి ఏడాది శిక్ష

మైనర్‌ బాలునికి ఏడాది శిక్ష

పలమనేరు: పలమనేరు పట్టణానికి చెందిన ఓ మైనర్‌ బాలునికి ఏదాడి పాటు జువైనెల్‌హోమ్‌లో ఉండేలా తిరుపతి జువనైల్‌ కోర్ట్‌ జడ్జి సంధ్యరాణి ఆదేశాలు జారీ చేసినట్టు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 15–09–2024లో పట్టణ సమీపంలోని బేరుపల్లి వద్ద మైనర్‌ బాలుడు స్ప్లెండర్‌ బైక్‌ నడుపుతూ నియంత్రణ కోల్పో యి ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో పాండురంగనాయుడు అనే వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు మైనర్‌ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని డీఎస్పీ సూచించారు. కాగా ఈ కేసును విచారించిన ఎస్‌ఐ స్వర్ణతేజ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ భాను కిరణ్మయిని ఆయన అభినందించారు.

కడుపు నొప్పి తాళలేక..!

– ఎలుకల మందు తాగి వ్యక్తి మృతి!

పుత్తూరు: ఓ వ్యక్తి కడుపు నొప్పి తాళలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పుత్తూరు పట్టణంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక గేటు వీధికి చెందిన లోకనాథం(60) గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నొప్పి పూర్తిగా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 15వ తేదీ సాయంత్రం ఇంట్లోనే ఎలుకల మందు తాగా డు. వాంతులు చేసుకోవడంతో పాటు కడుపునొప్పి తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యు లు నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు మహేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

బంగారుపాళెం: మండలంలోని సంక్రాంతిపల్లె వద్ద ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతిపల్లె పంచాయతీ, బేరిపల్లెకు చెందిన రాజబాబు(45) మహాశివరాత్రి సందర్భంగా చీకూరుపల్లెలోని సిద్ధేశ్వరస్వామి దర్శించుకునేందుకు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహ నంలో వెళ్లాడు. దర్శనం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. సంక్రాంతిపల్లె సమీపంలో చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న బుల్లెట్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజబాబు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

వేధింపులపై ఫిర్యాదు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో వివాహతను వాట్సాప్‌ సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురి చేయడంపై బాధితురాలు సోమ వారం పోలీసులను ఆశ్రయించారు. కొంగారెడ్డిపల్లికి చెందిన ఓ వివాహితకు కడపకు చెందిన ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర సందేశాలు పంపించడం, ఫొటోలో పెట్టడం చేస్తున్నాడు. పలుమార్లు హెచ్చరించినా యువకుడు పద్ధతి మార్చుకోలేదు. దీంతో బాధిత మహిళ వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement