పన్నుపోటు! | - | Sakshi
Sakshi News home page

పన్నుపోటు!

Feb 12 2026 7:28 AM | Updated on Feb 12 2026 7:28 AM

పన్ను

పన్నుపోటు!

నెలాఖరుకు 100 శాతం పన్నులు వసూలు చేయాలని హుకుం

లేకుంటే సస్పెండ్‌ చేస్తామని బెదిరింపులు

ఆందోళనలో పంచాయతీ కార్యదర్శులు

జిల్లాలో రూ.27.41 కోట్లు లక్ష్యం

కార్యదర్శులకు..

పన్ను వసూళ్ల విషయంలో పంచాయతీ కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఈ నెలాఖరు లోపు వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. లేకుంటే ఉద్యోగాలు ఊడుతాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిగుతున్నా పల్లెల్లో పన్నులు వసూళ్లుగాక.. ఏం చేయాలో తెలియక కార్యదర్శులు తలలుపట్టుకుంటున్నారు.

గుడిపాల మండలం

జిల్లా పంచాయతీ కార్యాలయం

చిత్తూరు కార్పొరేషన్‌: గ్రామీణ ప్రజల ముక్కుపిండి పన్ను వసూలు చేయాలంటూ కార్యదర్శులకు ప్రభుత్వం హుకుం జారీచేసింది. చేయని పక్షంలో సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగింది. ఈ పరిణామం పంచాయతీ కార్యదర్శుల్లో ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం రూ.27.41 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.14.06 కోట్లు వసూలు చేశారు. మిగిలిన మొత్తంలో ఈ నెల 15లోపు 50 శాతం, నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

సాంకేతిక సమస్యలతో సతమతం

పన్ను వసూళ్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ విధానం అవస్థలు తెచ్చిపెడుతోంది. ఎవరైతే తమ ఇంటికి, నీటి పన్నులు చెల్లించాలనుకుంటున్నారో.. వారి మొబైల్‌ నుంచే చెల్లింపులు చేపట్టాల్సి ఉంది. ఇది పెద్ద సమస్యగా మారింది. నిరక్షరాస్యులు ఆన్‌లైన్‌ పన్నులు చెల్లించే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారు పన్నులు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఒక ఇంటి నంబర్‌తో పన్ను చెల్లింపు ప్రారంభిస్తే అందులో ఏదైనా చిన్న సమస్య ఎదురైనా మరో 24 గంటల వరకు సర్వర్‌ స్తంభిస్తోంది. దీంతో ఆ ఇంటి పన్ను తిరిగి చెల్లించాలంటే మరో రోజు వేచి చూడాల్సి వస్తోంది.

జిల్లా సమాచారం

మండలం పన్ను రూ.లక్షల్లో

బైరెడ్డిపల్లె రూ.25.65

బంగారుపాళ్యం రూ.83.70

చిత్తూరు రూ.19.76

జీడీనెల్లూరు రూ.55.94

గంగవరం రూ.47.47

గుడిపాల రూ.53.48 గుడుపల్లె రూ.23.90 ఐరాల రూ.3.95 కోట్లు కార్వేటినగరం రూ.41.34 కుప్పం రూ.17.01

నగరి రూ.39.10

నిండ్ర రూ.15.13

పలమనేరు రూ.32.66

పాలసముద్రం రూ.8.81

పెద్దపంజాణి రూ.24.84

పెనుమూరు రూ.37.99

పూతలపట్టు రూ.43.66

పులిచెర్ల రూ.1.20 కోట్లు

రామకుప్పం రూ.15.07

రొంపిచెర్ల రూ.23.25

ఎస్‌ఆర్‌పురం రూ.28.37

శాంతిపురం రూ.25.10

తవణంపల్లె రూ.48

వి.కోట రూ.29.69

వెదురుకుప్పం రూ.74.87

విజయపురం రూ.16.24

యాదమరి రూ.59.84

మొత్తం రూ.14.06 కోట్లు

టెన్షన్‌ బాబోయ్‌!

పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియ పర్యవేక్షించాల్సిన విధులు కేటాయించారు. ఆ విధుల్లోనే ఎక్కువ సమయం పడుతోంది. అనంతరం పన్ను వసూళ్లకు రావాల్సి ఉంది. దీంతో పని ఒత్తిడి పెరుగుతోంది. పన్ను వసూళ్లపై ఒత్తిడి పెంచుతోంది. చేసేది లేక కార్యదర్శులు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒత్తిడిని తాళలేక వయసుపైబడిన సీనియర్‌ కార్యదర్శులు బీపీ, షుగర్‌ బారిన పడుతున్నట్టు పలువురు వాపోతున్నారు. కొందరు కార్యదర్శులైతే సెలవులో వెళ్లిపోయేందుకు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు.

పన్నుపోటు! 1
1/2

పన్నుపోటు!

పన్నుపోటు! 2
2/2

పన్నుపోటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement