ఒత్తిడితో దుష్ప్రభావాలు | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడితో దుష్ప్రభావాలు

Feb 14 2026 7:55 AM | Updated on Feb 14 2026 7:55 AM

ఒత్తి

ఒత్తిడితో దుష్ప్రభావాలు

● నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తున్న మానసిక వ్యాధులు ● కుటుంబ కలహాలు, ఆర్థిక కష్టాలు, పనిఒత్తిడులే కారణం

కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి

ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశ్చితి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్‌. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు.

ఆత్మహత్యలు... చివరి ఫలితం

ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు.

ఇవి పాటించాలి

సమయానికి నిద్రపోవాలి.

సమతుల ఆహారం తీసుకోవాలి

క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి

యోగా, మెడిటేషన్‌పై దృష్టి సారించి, క్రమం తప్పకుండా పాటించాలి

అధిక సెల్‌ఫోన్‌ వాడకం వదలి..పుస్తక పఠనంపై దృష్టి మళ్లించాలి

భావోద్వేగాలు, ప్రవర్తనపై అదుపు కలిగి ఉండాలి

అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి

నిద్ర పట్టకపోవడం

ఆకలి లేకపోవడం, లేక ఎక్కువ ఆహారం తినడం

ఊబకాయం

మహిళల్లో పీరియడ్స్‌ ఇబ్బందులు

తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు

వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో ఇన్‌ఫెక్షన్స్‌

ఒత్తిడితో దుష్ప్రభావాలు 
1
1/1

ఒత్తిడితో దుష్ప్రభావాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement