విజేతలు.. విభిన్న ప్రతిభావంతులు
చిత్తూరు కలెక్టరేట్ : విజేతలు విభిన్న ప్రతిభావంతులు అని సమగ్రశిక్ష శాఖ జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. ఆ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూలే భవనంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల్లో ప్రతిభను వెలికితీసేందుకు సాంస్కృతిక, పెయింటింగ్ పలు రకాల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. న్యూటన్, లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కిల్లర్ వంటి మేథావులు విభిన్న ప్రతిభావంతులే అయినప్పటికీ నూతన శకానికి నాంది పలికారన్నారు. వైకలాన్ని ఎదురించి మొక్కవోని దీక్షతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. డీఈవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వైకల్యం అంటేనే పెద్ద సవాలు అని అన్నారు. శ్రమిస్తే అసాధ్యమైనదంటూ ఏదీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల భవిత కేంద్రాల్లోని విభిన్న ప్రతిభావంతులు, జిల్లా సహిత విద్య కో–ఆర్డినేటర్ మధు సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.


