క్షమాపణ చెప్పు బాబు! | - | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పు బాబు!

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

క్షమాపణ చెప్పు బాబు!

క్షమాపణ చెప్పు బాబు!

తవణంపల్లె: పవిత్రమైన తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని, కానీ కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం మండలంలోని కాణిపాకం రోడ్డులోని నారాయణాద్రి కల్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ రిపోర్టులో తేలిపోయిందన్నారు. భక్తుల మనోభాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ హరిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్‌రెడ్డి, పార్టీ నాయకులు ప్రకాష్‌బాబురెడ్డి, సుకేష్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, నితిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement