హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్ర
తిరుమల లడ్డూలో కల్తీ లేదని తేలినా తప్పుడు ప్రచారం
సుప్రీం కోర్టు చెప్పినా పద్ధతి మారలేదు
వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి
పలమనేరు: తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో విచారణ చేసిన సిట్ సాక్షిగా రుజువైనా చంద్రబాబు తప్పుడు ప్రచా రం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరులోని వీటీఎస్ కల్యాణ మండపంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో పార్టీ పలమనేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అంతకుముందు పలమనేరు రూరల్ మండల కన్వీనర్ బాలాజీనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక డిగ్రీ కళాశాల నుంచి సభా వేదిక వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. భూమన మాట్లాడుతూ చంద్రబాబు బూటకపు హామీలను నమ్మిన జనం ఎంత మోసపోయారో అర్థమైందన్నారు. ప్రతినెలా ఓ కొత్త వివాదాన్ని లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిచామని, జగన్ కుదేలవుతాడని ఆయన ఊహించాడని అనుకున్నారని, జగన్‌కు ప్రజ లు పడుతున్న బ్రహ్మరథాన్ని చూసి ఓర్వలేక అభాండాలు మోపుతున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో చంద్రబాబు సీఎం అయ్యాకే కల్తీ వ్యవహారం వెలుగు చూసిందన్నారు. దీనిపై సుప్రీం కోర్టు 2024 ఆగస్టు 18న సీబీఐ నేపథ్యంలో సిట్ ఏర్పాటుచేసి విచారణ జరిపించింద్నారు. లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. ఆలయానికి నెయ్యి సర ఫరా చేసిన నిర్వాహకులు, ఆలయ ఉద్యోగులు, సాంకేతిక సిబ్బంది కుమ్ముకై ్క అక్రమాలు చేశారని తేల్చినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పింది నిజం కాద ని తేలడంతో వైఎస్సార్‌సీపీని హిందూ వ్యతిరేకిగా ము ద్రవేసేందుకు ఇది హిందువులపై సాగుతున్న కుట్ర అంటూ కొత్త ఆరోపణలను తెరపైకి తెచ్చా రని విమర్శించారు. మతం పేరిట జగన్‌ను అణగదొక్కాలని చూడడం ఆయన చేతగాని తనమన్నారు. ఇప్పటికే హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబుపై జనం నిప్పులు కక్కుతున్నారనే చేదు నిజం ఆయన బుర్రకెక్కడం లేదన్నారు. దేవునితో పెట్టుకుంటే పుట్టగతులుండవన్న విషయం త్వరలో తెలుస్తుందన్నారు. ఇది ఓ రకంగా హిందువులపై చంద్రబాబు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ కూటమి అరాచక పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు హయాంలోనే బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి
వాస్తవంగా నాటి టీడీపీ హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడే బోలేబాబా డెయిరీ నుంచి 1.60 లక్షల కేజీల నెయ్యి ఆలయానికి చేరిందన్నారు. 2014–19 కాలంలో ప్రీమియం డెయిరీ నుంచి 80 శాతం నెయ్యి వచ్చిందన్నారు. ఇవన్నీ ఆ వేంకటేశ్వరస్వామికి తెలుసునని, చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదన్నారు. గత ప్రభుత్వంలో మనం జనానికి చేసిన మేలును చెప్పుకోవడంలో విఫలమయ్యామని తెలిపారు. రాబోవు రోజుల్లో నాయకులు, కార్యకర్తలకు పార్టీలో పెద్దపీట ఉంటుందన్నారు.


