శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలి

Feb 14 2026 7:55 AM | Updated on Feb 14 2026 7:55 AM

శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలి

శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలి

చిత్తూరు కలెక్టరేట్‌: ఇరువర్గాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నగరి డీఎస్పీ సయ్యద్‌ మొహమ్మద్‌ అజీజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని శేషాపిరాన్‌ మసీదు కమిటీ వివాదంపై ఇరు వర్గాలతో శుక్రవారం కలెక్టరేట్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరువర్గాలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ రానున్న రంజాన్‌ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎవ్వరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదన్నారు. వివాదాస్పద చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, వన్‌ టౌన్‌ సీఐ మహేశ్వర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement