తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన ప్రమాదం

Feb 12 2026 7:28 AM | Updated on Feb 12 2026 7:28 AM

తప్పి

తప్పిన ప్రమాదం

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో బుధవారం సాయంత్రం రోడ్డుపై వెళుతున్న ఓ వాహనం అదుపుతప్పి.. గోడను ఢీ కొట్టడంతో ప్రమాదం తప్పింది. పలమనేరు వైపు నుంచి చిత్తూరు నగరానికి వస్తున్న ఓ ఐషర్‌ వాహనం న్యూట్రిన్‌ ఫ్యాక్టరీ సమీపంలో అదుపుతప్పి.. అవతలివైపు ఉన్న రోడ్డు దాటుకుంటూ ఓ గోడను ఢీకొట్టింది. అటువైపుగా వస్తున్న ఆటో ను సైతం ఢీ కొట్టగా ఎవరికీ ఎలాంటి గాయా లు కాలేదు. పాఠశాల ముగిసే సమయం కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినపుడు రోడ్డు పై ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.

జాతీయ సదస్సుకు

చిత్తూరు విద్యార్థి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఢిల్లీలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సదస్సుకు చిత్తూరు జిల్లాకు చెందిన కె. యుగవర్దన్‌ ఎంపికయ్యాడు. చిత్తూరు నగరం, మిట్టూరుకు చెందిన యుగవర్దన్‌ అపోలో విశ్వవిద్యాలయంలో బీటెక్‌ తృతీయ సంవత్సరం కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంశంపై జరుగనున్న ఈ సదస్సులో విద్యార్థి విభాగం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

క్రమశిక్షణ చర్యలు నిలుపుదల

చిత్తూరు కలెక్టరేట్‌: సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చెందిన గిరిపై క్రమశిక్షణ చర్యలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వును జారీచేసింది. ఆయన జిల్లాలో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆరోగ్య కారణాలతో రీసర్వే లక్ష్యాలను అధిగమించలేకపోతున్నానని, రెగ్యులర్‌ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నాననే కారణాలు చూపి 27.4.2022 నుంచి 28.6.2022 వరకు మెడికల్‌ సెలవుపై వెళ్లారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వును జారీచేసింది. అప్పట్లో దీనిపై విచారణాధికారి దర్యాప్తు జరిపి, చార్జెస్‌ నిరూపణ కాలేదని నివేదిక నిచ్చారు. ఈ క్రమంలో గతేడాది మార్చి 31న ఆయన ఉద్యోగ విరమణ చెందారు. విచారణ నివేదిక, చార్జెన్‌ నమోదైన అధికారి వివరణను పరిశీలించిన ప్రభుత్వం.. క్రమశిక్షణ చర్యలపై తదుపరి చర్యల్ని నిలిపివేస్తూ ఉత్తర్వును జారీచేసింది.

తప్పిన ప్రమాదం 
1
1/1

తప్పిన ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement