నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌నకు ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని షేక్ అల్మాస్ జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. బెంగళూరులో జరగనున్న నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌నకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తరఫున ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.మనోహర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎంపికై న విద్యార్థిని బెంగళూరులోని డాక్టర్.మన్మోహన్‌సింగ్ యూనివర్సిటీలో ఏడు రోజుల పాటు నిర్వహించే జాతీయ సమగ్రతా శిబిరంలో పాల్గొంటుందని తెలిపారు. అనంతరం జాతీయ స్థాయి శిబిరానికి ఎంపికై న చిత్తూరు విద్యార్థినిని అభినందించారు.
వ్యక్తిగత కారణాల వల్లే దాడి
చిత్తూరు అర్బన్: చిత్తూరు కట్టమంచిలోని ఓ ప్రదేశంలో రాకేష్ అనే ఇంజినీరింగ్ విద్యార్థిపై జరిగిన దాడి.. గతంలో ఉన్న వ్యక్తిగత కారణాల వల్లే జరిగిందని పోలీసుశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గంజాయిపై సమాచారం ఇచ్చాడనే కారణంతో రాకేష్‌పై దాడి జరగలేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే పూతలపట్టు స్టేషన్‌లో కేసు నమోదయ్యిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
టీడీపీలో వర్గ విభేదాలు
శ్రీరంగరాజపురం : స్థానిక టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నా యి. ఈ ఘటన మండలంలోని ఏఎం.పురం దళిత వాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ఏఎం.పురంలో అనారోగ్యంతో యువకుడు ప్రకాష్ మృతి చెందాడు. కాగా గ్రామంలో కొంతమందికి అమ్మో రు ఉండడంతో ఊర్లో డ్రమ్స్ కొట్టరాదని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఊరు దాటి దాహన సంస్కారానికి తీసు కువెళుతుండగా టీడీపీ ఏఎం.పురం భూత్ కన్వీనర్ గజేంద్ర డ్రమ్స్ కొట్టొదని చెప్పాడు. దీంతో అక్కడ ఉన్న కొంతమంది యువకులు వాగ్వాదానికి దిగారు. యువకులు గజేంద్రపై దాడి చేశారు. టీడీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుండయ్య ప్రమేయంతోనే తనపై యువకులు దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఆపై తనకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌నకు ఎంపిక


