ఆటోను ఢీకొన్న కంటైనర్
– ఇద్దరికి గాయాలు
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్‌లో గురువారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై లగేజీ ఆటోను కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పలమనేరు నుంచి బంగారుపాళెంకు టమాట లోడ్డులో వస్తున్న లగేజీ ఆటోను మొగిలి ఘాట్ వద్ద బెంగళూరు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజ, అర్షద్‌ఆలీ గాయపడ్డారు. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆటోను ఢీకొన్న కంటైనర్
ఆటోను ఢీకొన్న కంటైనర్


