సన్నిధిగొల్లను వేధించడం అన్యాయం
నగరి: వడమాలపేట మండలం, అప్పలాయగుంటలో కొలువైన ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొలిదర్శనం చేసుకునే సన్నిధి గొల్లను విధులకు రావొద్దంటూ రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు హుకుం జారీ చేయడం అన్యాయమని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సన్నిధిగొల్ల వెంకటేశ్ యాదవ్, విశ్రాంత సన్నిధిగొల్ల మునికృష్ణయాదవ్ తమను విధుల నుండి తొలగించారంటూ మీడియా సాక్షిగా ఆలయం ముందు విలపించడంపై ఆమె స్పందించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో దశాబ్దాలుగా స్వామి సేవలో ఉన్న సన్నిధిగొల్ల కుటుంబాన్ని రాజకీయ కక్షలతో దూరం పెట్టడం దారుణమన్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని అన్నారు. సంప్రదాయాలను కాపాడాల్సిన ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సన్నిధిగొల్లకు న్యాయం చేసి అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను కాపాడాలన్నారు.
స్పందిస్తున్న దయార్థ్ర హృదయాలు
నగరి: మండలంలోని తడుకు దళితవాడకు చెందిన విద్యార్థిని ప్రభావతి ఆరోగ్య పరిస్థితిని వెలుగులోనికి తెస్తూ బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘ప్రభావతం.. ప్రాణసంకటం’ అనే వార్తకు దయార్థ్ర హృదయాలు స్పందిస్తున్నాయి. ఆమె ఫోన్‌పే, గూగుల్‌పే నెంబర్లకు శుక్రవారం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఫోన్ నెంబర్లు 90325 01552, 90590 78374కు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా సాయం చేయాలని ప్రభావతి తల్లి రాములమ్మ కోరారు.
సన్నిధిగొల్లను వేధించడం అన్యాయం


