రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కార్వేటినగరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని తురకమిట్ట సమీపంలో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బీ.దేవి, బీ.హరిభూషణ, ఎన్.జ్యోతికుమార్, బీ.జ్యోతికుమార్, బీ.సుజాత(బుజ్జి)తో పాటు పలువురు మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని స్వామి దర్శనం కోసం కారులో తలకోనకు వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో తురకమిట్ట సమీపంలో ఎల్‌ఆర్‌పేట పంచాయతీ, కొత్తఇండ్లు గ్రామానికి చెందిన మురళీకృష్ణ(మేసీ్త్ర) పనికోసం ద్విచక్ర వాహనంలో పళ్లిపట్టుకు వెళుతున్న సమయంలో ఆయన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తాపడింది. ఈ క్రమంలో శ్రీనివాసులు భార్య బీ.దేవి(35) అక్కడికక్కడే మృతి చెందింది. హరిభూషణం, జ్యోతికుమార్, సుజాత, బి.జ్యోతికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను 108 వాహనం ద్వారా తిరుపతి రుయాకు తరలించారు. దేవి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దేవి భర్త శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


