విభిన్న ప్రతిభావంతుల ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల ప్రతిభ అమోఘమని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పూలే భవనంలో సమగ్రశిక్ష శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆర్ట్, సాంస్కృతిక పోటీ లు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పోటీలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీ మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగాల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఐన్‌స్టీన్, న్యూ టన్, లూయిస్ బ్రెయిలీ, హెలన్ కెల్లర్ తదితర ఉద్దండులైన వ్యక్తులు విభిన్న ప్రతిభావంతులేనని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఆర్ట్స్, సాంస్కృతిక పోటీల్లో విభిన్న ప్రతిభావంతులు తమదైన శైలిలో ప్రతిభ చాటారన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు, మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఈ కో ఆర్డినేటర్ మధు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.
విజేతలు ఇలా......
డ్యాన్స్ జూనియర్ విభాగంలో లోకేశ్వరి (కార్వేటినగరం) గీతిక (ఐరాల), దీక్షిత (గుడిపాల), సీనియర్ విభాగంలో చరణ్ (శాంతిపురం), వైష్ణవి (వెదురుకుప్పం), లాస్య (తవణంపల్లె) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. పాటల పోటీలో జూనియర్ విభాగంలో నరేష్ (రామకుప్పం), హారిక (ఎస్‌ఆర్పురం), సీనియర్ విభాగంలో జగదీష్ (ఎస్‌ఆర్పురం), జానుశ్రీ (పుంగనూరు), ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందారు. చిత్రలేఖనం పోటీలో రేణుశ్రీ (గంగాధరనెల్లూరు), దీక్షిత (గుడిపాల), ఆనందన్ (నగరి), సీనియర్ విభాగంలో ఇందు (పుంగనూరు), వాసుదేవరెడ్డి (వెదురుకుప్పం), ఢిలీబాబు (తవణంపల్లె), పోస్టర్ మేకింగ్ పోటీలో మమత (పూతలపట్టు), జయశ్రీ. (గంగాధరనెల్లూరు), ప్రీతిక (నిండ్ర) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతియ బహుమతులు సాధించారు.


