కల్తీ పాల తయారీ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

కల్తీ పాల తయారీ ఇలా..

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

కల్తీ

కల్తీ పాల తయారీ ఇలా..

20 లీటర్ల నీళ్లతో 25 లీటర్ల పాలు తయారీ కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగులోకి.. పాల తయారీ.. రసాయనాల రవాణా ఇక్కడి నుంచే కూటమి నేతలే కెమికల్‌ డాన్లు చేష్టలుడిగిన ఏపీ యంత్రాంగం కర్ణాటక పోలీసులను కట్టడి చేసేందుకు అధికార పార్టీ నాయకుల యత్నం

సీఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పా‘పాల’ పుట్టకు ప్రతిరూపంగా మారింది. ఇక్కడి కూటమి నేతలు కెమికల్‌ డాన్లుగా మారిపోయారు. అధికార మదంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు తాగే పాలలో రసాయనాలు కలిపి ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారు. పాలకూట విషాన్ని అధికార పలుకుబడితో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల అక్కడి ఫుడ్‌ సేఫ్టీ అధికారుల విచారణలో అసలు విషయం బయటపడింది. కల్తీ రాయుళ్ల ఆటకట్టించడంలో ఇక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాలం చెల్లిన పాల పౌడర్‌, పామాయిల్‌, చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలను కలిపి మిక్సీ పడతారు. తద్వారా చిక్కటి క్రీం తయారవుతున్నట్టు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇలా తయారైన లీటరు క్రీంలో నాలుగు లీటర్ల పాలు, 20 లీటర్ల నీటిని కలిపి మొత్తంగా 25 లీటర్ల పాలను తయారుచేస్తున్నారు. ఈ పాలను వివిధ డెయిరీలకు విక్రయించి వినియోగదారులపైకి వదులుతున్నారు. తమ బండారం బయట పడకుండా ప్రైవేటు డెయిరీల్లోని ఉద్యోగులను కల్తీపాల మాఫియా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. తమ అక్రమార్జనలో వా టాలు ఇస్తూ, మాట వినని వారిని బెదిరింపులతో నె ట్టుకొస్తున్నారు. కృత్రిమంగా తయారు చేస్తున్న పాల లో ఏయే రసాయనాలను ఏ మోతాదులో కలిపారో నిర్ధారించేందుకు పొరుగు రాష్ట్ర పోలీసులు పాల

నమూనాలను పరీక్షలకు పంపారు.

ఇవేం పాపాలు

కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి పాల తయారీకి కావాల్సిన రసాయనాలు, వస్తువులను సేకరించి తమకు అనుకూలంగా ఉన్న డెయిరీల ఏజెంట్లకు అందిస్తున్నారని తెలిసింది. ఓ మహిళా నాయకురాలి భర్త కనుసన్నల్లోనే కుప్పంతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు పాల తయారీ రసాయనాలు రవాణా అవుతున్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్‌లోని ఫుడ్‌ సేప్టీ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తీగలా గడంతో కుప్పంలో డొంక కదులుతోంది.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఊకదంచుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కానీ స్థానిక పరిస్థితులు మాత్రం నేతి బీరకాయను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తూ కుప్పం ప్రాంతానికి చెందిన కూటమి నాయకులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు కల్తీ పాల దందా కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అందరికీ అవసరమైన పాలను విషంగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.

పట్టని పాలకులు

కల్తీ పాల తయారీకి కుప్పం అడ్డాగా మారిందని పొరుగు రాష్ట్రాల పోలీసులు చర్యలకు ఉపక్రమించినా స్థానిక అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడడం లేదు. నెలవారీగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా పట్టించుకోవడం మానేశారు. పైపెచ్చు పొరుగు రాష్ట్ర విచారణ సంస్థలకు కూడా సహకరించడం లేదనే అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. కల్తీ పాల ముడి సరుకులను అందిస్తున్న కీలకమైన వ్యక్తిని పట్టుకునేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన కర్ణాటక పోలీసులను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అడ్డుకుని బలవంతంగా వెళ్లగొట్టినట్టు సమాచారం. కర్ణాటకలోని రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చి అక్కడి పోలీసులను కట్టడి చేసేందుకు అధికార పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కలెక్టర్‌, ఎస్పీ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

డొంక కదులుతోంది

ఆమె భర్తే కల్తీ డాన్‌

రసాయనాలతో తయారు చేస్తున్న కల్తీ పాలు పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రంలోకి వస్తున్నట్టు గుర్తించిన అక్కడి పోలీసులు గత నెలలో కోలారు జిల్లా కేజీఎఫ్‌ ఎస్పీ పరిధిలోని ఆండర్సన్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కుప్పానికి చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుప్పానికి చెందిన ఓ మహిళా నాయకురాలి భర్త కల్తీ పాల తయారీ రాకెట్‌కు సూత్రధారిగా ఉన్నాడని అక్కడి పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

కుప్పం నుంచి పొరుగు రాష్ట్రాలకు కల్తీ పాలు

కల్తీ పాల తయారీ ఇలా.. 
1
1/3

కల్తీ పాల తయారీ ఇలా..

కల్తీ పాల తయారీ ఇలా.. 
2
2/3

కల్తీ పాల తయారీ ఇలా..

కల్తీ పాల తయారీ ఇలా.. 
3
3/3

కల్తీ పాల తయారీ ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement