ఏనుగుల హల్‌చల్
వెదురుకుప్పం: మండలంలోని తిప్పినాయుడుపల్లె గ్రామ పరిసరాల్లో జంట ఏనుగులు హల్‌చల్ చేశా యి. శక్రవారం ఉదయం శ్రీరంగరాజపురం మండలంలోని మంగుంట, పిల్లిగుండ్లపల్లె అటవీ ప్రాంతాల మీదుగా మండలంలోకి ప్రవేశించాయి. ఉద యం గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొలాల గుండా అడుగులు వేస్తూ పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులు వచ్చాయన్న సమాచారంతో సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా రు. దీంతో ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. గ్రామం పక్కనే ఉన్న ముళ్ల పొదల మాటున నిలిచిపోయాయి. విషయం తెలియడంతో వెదురుకుప్పం ఎస్‌ఐ నవీన్‌బాబు, ఎంపీడీఓ పురుషోత్తం, తిప్పినాయుడుపల్లె సర్పంచ్ రాజశేఖర్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి ఏనుగుల నియంత్రణకు మార్గాలను అన్వేషించారు. ఏనుగుల సంచారంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు తిప్పినాయుడుపల్లె గ్రామ పరిసర ప్రాంతాల్లోకెళ్లి గ్రామాల మీదకు రానీయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడి నుంచి కదలకపోవడంతో అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. సాయంత్రం దాటాక టపాకాయలు పేల్చి అటవీ ప్రాంతాలకు తరిమేస్తామని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి తరుముతున్నా మళ్లీ అదే స్థానానికి వచ్చి చేరుతున్నాయని స్థానికులు చెప్తున్నారు.
ఒంటరి ఏనుగు హల్‌చల్
గంగవరం: మండలంలో కీలపట్ల బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఒంటరి ఏనుగు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కీలపట్ల, కెసి.పెంట, మేలుమాయి, కొత్తపల్లి, కల్లుపల్లి, బూడిదపల్లి ప్రాంతాల్లో సంచరిస్తోంది. రాత్రి వేళ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నట్టు రైతులు పేర్కొన్నారు. గురువారం రాత్రి బూడిదపల్లి గ్రామం ఆనుకుని మామిడి తోపులో ఏనుగును గమనించిన స్థానికులు ఫారెస్ట్ సిబ్బంది సాయంతో టపాసులు పేల్చి అక్కడి నుంచి తరిమేశారు. అక్కడి నుంచి రాయలపేట అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్టు అటవీ సిబ్బంది చెబుతున్నారు. శుక్రువారం కెసి.పెంట అటవీ సరిహద్దులోని పులిఈతవంక దగ్గర ఒంటరి ఏనుగు ఉన్నట్టు పశువుల కాపరులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మధ్య తరచూ ఇదే ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తుండడంతో రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ముసలమడుగు ఎలిఫ్యాంట్ క్యాంప్ వద్ద కుంకీ ఏనుగుల సాయంతో ఒంటరి ఏనుగును దారి మళ్లించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోయేంతవరకు పట్టించుకోరా..? అంటూ ఫారెస్ట్ అధికారులపై మండిపడుతున్నారు.
పంటలకు భారీ నష్టం
జంట ఏనుగులు రాత్రికి అక్కడే ఉంటే ప్రాణ నష్టంతో పాటు పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి చొరబడితే ఇళ్లను ధ్వంసం చేసి మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అదేవిధంగా బొమ్మయ్యపల్లె గ్రామా నికి చెందిన రైతులు వందల ఎకరాల్లో సాగు చేసిన పంటలను ధ్వసం చేసే ఆస్కారం ఉందంటున్నారు. వరి, చెరుకు, వేరుశనగ పంటలను ధ్వంసం చేస్తే లక్షల ఎకరాల్లో నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల హల్‌చల్


