రెండు వారాల్లో చిత్తూరు–తచ్చూరు రోడ్డు | - | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో చిత్తూరు–తచ్చూరు రోడ్డు

Feb 18 2026 7:16 AM | Updated on Feb 18 2026 7:16 AM

రెండు వారాల్లో చిత్తూరు–తచ్చూరు రోడ్డు

రెండు వారాల్లో చిత్తూరు–తచ్చూరు రోడ్డు

● జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డు పనులను వంద శాతం పూర్తి చేస్తామని, అలాగే మార్చి చివ రి లోపు కట్టమంచి–సాంబయ్యకండ్రిగ రోడ్డు ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ● కుప్పం నుంచి హోసూర్‌ వరకు సుమారు 60 కి.మీ మేరకు ఎన్‌హెచ్‌ 4 రోడ్డు పనులకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : రెండు వారాల్లో చిత్తూరు–తచ్చూరు రోడ్డును ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో పలు అంశాలను విలేకరులకు వెల్లడించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులు త్వరలో రానున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రహదారి పనులు, రాబోయే వేసవి సవాళ్లు, విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులను ఆయన వివరించారు.

రహదారుల నిర్మాణం

నీటి ఎద్దడి తలెత్తకుండా...

వేసవిలో జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 72 ప్రధాన చెరువుల్లో ప్రస్తు తం 80 శాతం మేరకు నీటి నిల్వ ఉందన్నారు.

జూన్‌ నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో

తరగతులు

చిత్తూరు, కుప్పం కేంద్రీయ విద్యాలయాల్లో జూన్‌ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్నారు. వేగవంతంగా కేంద్రీయ విద్యాలయ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement