కన్నీటి వీడ్కోలు!
– పుదుచ్చేరిలో మృతి చెందిన యువకులకు అంత్యక్రియలు
చిత్తూరు అర్బన్: సరదాగా టూర్ వెళ్లి పుదుచ్చేరిలో మృతి చెందిన జశ్వంత్, సాదిక్ మృతదేహాలకు మంగళవారం వారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. చిత్తూరు నగరానికి చెందిన సాదిక్, జస్వంత్, జయంత్, నవాజ్ అనే నలుగురు స్నేహితులు ఆదివారం పుదుచ్చేరికి బైకు లో వెళ్లారు. సోమవారం ఇక్కడి బీచ్‌లో స్నానాలు చేస్తుండగా భారీ రాకాసి అలలు వచ్చాయి. ఈ అలల్లో చిక్కుకున్న సాదిక్( 22), జస్వంత్ చౌదరి (25) ఇద్దరూ మృతిచెందారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలకు పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రి ఇద్దరు యువకుల మృతదేహాలను చిత్తూరుకు తీసుకొచ్చి.. వారి స్వగ్రామాలలో అంత్యక్రియలు నిర్వహించారు.
జేఈఈ మెయిన్స్‌లో వికాస్ ప్రతిభ
వడమాలపేట (పుత్తూరు): దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలో వడమాలపేటకు చెందిన లోకేష్, సుహాసిని దంపతుల కుమారుడు పి.వికాస్ 99.32 శాతం సాధించి సత్తా చాటాడు. వికాస్ తిరుపతి ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. వికాస్ జేఈఈ మెయిన్స్‌లో మంచి ప్రతిభ కనపబరచడంతో పలువురు అభినందించారు.
పుదుచ్చేరి బీచ్‌లో మృతి చెందిన జశ్వంత్
సాదిక్ మృతదేహం
కన్నీటి వీడ్కోలు!
కన్నీటి వీడ్కోలు!


