అంగన్‌వాడీల్లో ‘బామ్మ పాఠాలు’ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ‘బామ్మ పాఠాలు’

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : అంగన్‌వాడీల్లో చిన్నారుల కు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు నైతిక విలువలతో కూడిన బామ్మ పాఠాలు బోధించేందుకు చర్యలు చేపట్టినట్లు ఐసీడీఎస్‌ అధికారు లు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ జిల్లాలో ఆసక్తి గల బామ్మలు, రిటైర్డ్‌ ఉద్యోగులతో పాఠా లు నేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 2,420 అంగన్‌వాడీ కేంద్రాల్లో వృద్ధ మహిళల సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం, ఆటపాటలు నేర్పించడం, ఆరోగ్య సూత్రాలు, నైతిక విలువలతో కూడిన కుటుంబ బంధాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. రోజూ ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైన సమయాల్లో వచ్చి ఆరేళ్ల లోపు పిల్లలకు పాఠాలు నేర్పించాల్సి ఉంటుందని ఐసీడీఎస్‌ అధికారులు వెల్లడిస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ

గంగాధర నెల్లూరు : మండలంలోని ఎట్టేరి, మోతరంగనపల్లె, రామానాయుడుపల్లె, గంగాధరనెల్లూరు అంగన్‌వాడీ కేంద్రాలను డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఇన్‌చార్జి సీడీపీఓ అనూరాధ, సూపర్‌వైజర్‌ సంగీత పాల్గొన్నారు.

‘ప్రేరణ’కు

పదోతరగతి విద్యార్థిని

పెద్దపంజాణి: మండలంలోని రాయలపేట కేవీసీఆర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని జి.శాంభవి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రేరణ కార్యక్రమానికి ఎంపికై ంది. గురువారం ఈ మేరకు ఉపాధ్యాయులు మాట్లాడుతూ త్వరలో గుజరాత్‌లో జాతీయ విద్యా విధానంపై చేపట్టనున్న ప్రత్యేక సదస్సులో శాంభవి పాల్గొంటుందని వెల్లడించారు.

నిరక్షరాస్యులకు సదవకాశం

గుడిపాల: నిరక్షరాస్యులకు సార్వత్రిక విద్యాపీఠంలో చదువుకునేందుకు సదవకాశం కల్పిస్తున్నట్లు విద్యాపీఠం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ ఓపెన్‌ స్కూల్‌ డీసీఓ జయప్రకాష్‌ తెలిపారు. గురువారం నరహరిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సార్వత్రిక విద్యాపీఠంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యులతోపాటు పదోతరగతిలోపు చదువు మానేసిన వారు సార్వత్రిక విద్యాపీఠంలో చేరి 10, 12వ తరగతులు అభ్యసించవచ్చని వివరించారు. ఎంఈఓలు హసన్‌బాషా, గణపతి, ప్రధానోపాధ్యాయులు దుర్వాసులు, కిరణ్‌కుమార్‌, హేమాద్రి, శారద, పండరీ పాల్గొన్నారు.

2న యోగాసన పోటీలు

చిత్తూరు కలెక్టరేట్‌ : యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీన జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్న ట్లు సంఘం ప్రధాన కార్యదర్శి యుక్తా చౌదరి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ ఆదివారం చిత్తూరు గ్రీమ్స్‌పేట మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ట్రెడిషనల్‌ యోగాసన, ఆర్టిస్టిక్‌ యోగాసన, రిథమిక్‌ యోగాసన కింద మొత్తం ఆరు కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వివరించారు. సబ్‌ జూనియర్స్‌ (10–14 ఏళ్లు), జూనియర్స్‌ (14–18 ఏళ్లు), సీనియర్స్‌ (18–28), సీనియర్స్‌–ఏ (28– 35), సీనియర్‌–బీ (35–45), సీనియర్స్‌– సీ (45–55) కేటగిరీల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. ఇతర వివరాలకు 6303899780, 9985407782 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement