చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరుకుంది. తన సామాజిక మాధ్యమాల్లో స్వయానా ఎమ్మెల్యేనే ఓ పోస్టు పెట్టారు. ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలను తెలియచేస్తూ.. తన ఫొటో అందులో వేసుకున్నారు. 1,538 ఖాళీలు ఎస్‌బీఐలో ఉన్నట్లు పేర్కొంటూ ఎమ్మెల్యే తన ఫొటో వేసుకోవడంపై జనం నవ్వుకుంటున్నారు. బ్యాంకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఎమ్మెల్యే తన ఖాతాలోకి వేసుకుంటూ.. ఇది కూడా కూటమి ప్రభుత్వ విజయంగా చెబుతున్నారా..? అందుకే తన ఫొటో వేసుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారా..? అంటూ పోస్టులు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. – చిత్తూరు అర్బన్


