నకిలీ బంగారం మాయలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారం మాయలు

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

చిత్తూరు డీసీసీబీ బ్రాంచ్‌లో వెలుగుచూసిన బంగారు మాయజాలం తీవ్ర కలకలం రేపింది. కనీస నాణ్యత లేని బంగారాన్ని అసలైనదిగా చిత్రీకరించి ఏకంగా రూ.52 లక్షల మేర రుణాలు మంజూరు చేశారు. ప్రాథమిక విచారణలో ఈ దగా రుజువు కావడంతో బ్రాంచ్‌ చీఫ్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేశారు. దీనికి సహకరించిన తాత్కాలిక నగల అప్రైజర్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. బయటపడిన సంఘటనలు చిత్తూరుతో పాటు కార్వేటినగరం మాత్రమేనని, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఉమ్మడి జిల్లాలోని పలు సొసైటీల్లో లోతుగా తనిఖీలు చేపడితే మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావడం ఖాయమని శాఖలోని పలువురు ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై డీసీసీబీ సీఈఓ శంకర్‌బాబును విరణ కోరగా.. శాఖ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని, అవకతవకలకు పాల్పడితే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement