నిరసన | - | Sakshi
Sakshi News home page

నిరసన

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

● చిత్తూరులో జనతా బజార్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో యువతను చైతన్య పరచడానికి అనంతపురం జిల్లా నుంచి కళామైత్రి కళబృందం సభ్యులు గీతాలు ఆలపించారు. ● పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమనక్వయకర్త సునీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్‌ కుమార్‌రాజా, సీనియర్‌ నాయకులు మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ● కుప్పంలో ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద నిర్వహించిన దీక్షలో ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో లోకేష్‌ ఆడుకోవడం సరికాదని, బాఽధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ● నగరిలోని బైపాస్‌ సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహం, పలమనేరులో మార్కెట్‌ యార్డ్‌ సమీపంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలో నాయకులు మాట్లాడారు. జిల్లాలో అనేక మంది అభ్యర్థులు డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాల వల్ల నష్టపోయారన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్‌సీపీ పోరుబాట డీఎస్సీలో అవినీతిపై సీబీఐ విచారణ చేయాల్సిందే.. యువతను వంచించిన మంత్రి లోకేష్‌ రాజీనామాకు డిమాండ్‌ నిరుద్యోగ భృతి పేరిట మోసానికి బాధ్యత వహించాల్సిందే.. వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించడంలో బాబు సర్కారు వైఫల్యం రిలే నిరాహార దీక్షలో పెద్దిరెడ్డి, భూమన

గంగాధర నెల్లూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

పలమనేరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ యువ జనం విభాగం, విద్యార్థి విభాగాల నాయకులు, నిరుద్యోగులు రిలో నిరాహర దీక్ష చేపట్టారు.

నిరాహార

చిత్తూరు కార్పొరేషన్‌: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం యువతను నమ్మించి, మోసం చేసిన ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహారదీక్షకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమ న కరుణాకరరెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కూడా వారిద్దరూ హాజరై సంఘీభావం తెలిపారు. పెద్దిరెడ్డి మా ట్లాడుతూ 16వేల డీఎస్సీ ఉద్యోగాలను టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టి, పేద బిడ్డల జీవితాలను బలిపెడుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుంటే చంద్రబాబు, లోకేష్‌ మాత్రం సమాధానం చెప్పకుండా తిరుగుతు న్నారని విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తామమని స్పష్టం చేశారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రెండో రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరహారదీక్షలకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికుతున్నారు.

యాదమరి శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌

కుప్పంలో నిర్వహించిన రిలే దీక్షలో ఎమ్మెల్సీ భరత్‌, పార్టీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement