ఆడికృత్తిక ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఆడికృత్తిక ఉత్సవాలు

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

● వినూత్న విన్యాసాలు కావళ్ల చెల్లింపు ● కొండ చుట్టూ ఏటూ చూసినా జనమే జనం

జనంతో నిండిన గుడివంక

కుప్పం: మూడు రాష్ట్రాల కూడిలి.. పశ్చిమ నదీ ప్రవాహం ప్రాతం గుడుపల్లె మండలంలోని గుడివంకలో వెలసిన శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం భక్తులు కావుళ్లు చెల్లింపునకు భారీ సంఖ్యలో తరలిరావడంతో గుడింవంక కొండ ప్రాతంలో జనసందోహం కిక్కిరింది.

హారోం హర.. నామస్మరణ

సుబ్రమణ్యస్వామి భక్తులు కావుళ్లు తీసుకుని గుడివంక ఆలయంలో వేల్‌ మురుగనికి హరోం హరా.. నామ సర్మరణతో మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులు కావళ్లతో పాటు ఎస్కార్ట్‌ వాహనంలో వీపునకు కొక్కీలు తగలించుకుని గాలిలో విన్యాసాలు చేస్తూ హరోం హరా.. నామాన్ని స్మరిస్తూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా వీపునకు కొక్కీలు వేసుకుని రథం, రాగుల గుండు, తేరు లాక్కుని కొండెక్కి వచ్చి మొక్కులు చెల్లించారు. పంబ వాయిద్యాల మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ వచ్చారు. కొండ కింద ఉన్న కోనేరులో స్థానాలు చేసుకుని కావుళ్ళు తీసుకుని కొండెక్కి భక్తుల స్వామి వారిని దర్శించుకున్నారు.

కిక్కిరిసిన జనం

గుడివంక కొండకు ఉన్న నాలుగు వైపు రోడ్లలో భక్త జనంతో కిక్కిరింసింది. భక్తులు నడవడానికి సైతం ఇబ్బందిగా మారింది. వాహనాలు పార్కింగ్‌ సరైన స్థలం లేకపోవడంతో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్‌ చేయడంలో తీవ్రమైనా ట్రాఫిక్‌ సమస్యల నెల కోనింది.

భక్తుల విన్యాసాలు

రాగుల గుండును లాక్కెళుతున్న భక్తుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement