ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పోరాటం సాగిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య స్పష్టం చేశారు. శనివారం చిత్తూరులోని ఓ ప్రైవేట్‌ కల్యాణమండపంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారిగా కడప జిల్లా అధ్యక్షుడు రఘురామ్‌ నాయుడు వ్యవహరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొత్తం 21 పోస్టులకు ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. సంఘం అధ్యక్షుడిగా శివయ్య, కార్యదర్శిగా నరేష్‌బాబు, అసోసియేట్‌ అధ్యక్షుడిగా దేవకుమార్‌, ఉపాధ్యక్షులుగా కృష్ణమూర్తి, గౌరీశంకర్‌, గిరిధర్‌రెడ్డి, వివేక్‌, కుమార్‌స్వామియాదవ్‌, వరలక్ష్మీదేవి, వేణుగోపాలరావు, ధరణికుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా మోహన్‌, జాయింట్‌ కార్యదర్శులుగా దుర్గాప్రసాద్‌, బాలు విజయ్‌కుమార్‌, కిషోర్‌, ఉమా, రుక్మాంద, భాను ప్రసాద్‌, ప్రమీల, అనిత, వెంకట చలపతి ఎన్నికయ్యారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ పీఆర్‌సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement