ఎల్‌నినో ప్రభావంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావంపై అవగాహన

Aug 5 2026 12:24 AM | Updated on Aug 5 2026 12:24 AM

కుప్పం రూరల్‌ : ఎల్‌నినో ప్రభావం, తలెత్తే నష్టాలపై రైతులకు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సుమతి అవగాహన కల్పించా రు. మంగళవారం కుప్పం మండలం కమతమూరు లో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడారు. వర్షాబావ పరిస్థితుల్లో వరి కి ప్రత్యామ్నాయంగా రాగి, సజ్జలు, కొర్రలు, మిను ములు, కందులను సాగు చేసుకోవాలన్నారు. డ్రిప్‌ ద్వారానే పంటలకు నీటిని అందించాలని సూచించారు. చెరువులు, కుంటలు, పాండ్లలో నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. పంటలు వాడిపోతుంటే లీటర్‌ నీటిలో 20 గ్రాముల యూరియా లేక 19:19:19 లేదా 20:20:20 మందులను పిచికారీ చేయాలని కోరారు. మల్చింగ్‌ ద్వారా సాగు చేపడితే ఎక్కువ రోజులు తేమ ఉంటుందన్నారు. కూరగాయలను షెడ్లలోనే సాగు చేయాలని తెలిపారు. నత్రజని ఎక్కువ ఉన్న ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులను వినియోగించాలని చెప్పారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మురళి, ఉద్యాన సంచాలకులు పల్లవి, కృష్ణారెడ్డి, శాస్త్రవేత్తలు నాగమాధురి, భారతి, మహేశ్వరరెడ్డి, విశ్వనాథ్‌, అరుణ, నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, శివశంకర్‌, ఫయాజ్‌, ఔరంగ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement