చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు టీచర్లు, హెచ్‌ఎంలు, ఇతర కేడర్ ఉపాధ్యాయులకు కనీసం 10 ఏళ్ల సర్వీ సు పూర్తయి ఉండాలని వెల్లడించారు. అర్హులైన ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనల రెండు కాపీలను ఈ నెల 20వ తేదీలోపు సంబంధిత డీవైఈఓకు సమర్పించాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే ప్రతిపాదనలు స్వీకరించమని స్పష్టం చేశారు.
నేడు జిల్లాలో కళాశాలల బంద్
చిత్తూరు కలెక్టరేట్ : విద్యారంగ సమస్యల పరిష్కారానికి బుధవారం కళాశాలల బంద్ చేపడుతున్నట్లు ఏబీ వీపీ జిల్లా కన్వీనర్ హర్షవర్ధన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలను వెంటనే విడుదల చేయాలన్నారు. డిగ్రీతో సహా అన్ని కోర్సుల అడ్మిషన్‌ల ప్రక్రి యను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అన్ని యూనివర్సిటీలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. పీజీ విద్యార్థులకు నష్టం చేకూరుస్తున్న జీఓ నంబర్ 77ను రద్దు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించి, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించా రు. జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఏ కేటగిరీ సీట్లకు అదనపు రుసుము వసూలును అరికట్టాలని స్పష్టం చేశారు. ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల్లో కన్వీనర్ కోటాను తప్పనిసరి చేయాలన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కళాశాలల బంద్‌ను విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం
– ఎమ్మెల్యే గురజాల
జగన్‌మోహన్‌నాయుడిపై ఫిర్యాదు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడంలేదు. ఇప్పటికే కర్ణాటకలో పలు భాషా సంఘాలు, ఉద్యమకారులు గురజాల జగన్‌మోహన్ నాయుడిపై పోలీసులకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వివాదం తమిళనాడుకు పాకింది. ఇటీవల చిత్తూరులోని ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్ణాట క, తమిళనాడు ఎక్కడైనా తెలుగువాళ్లు ఏలుతారని, మోదీ ప్రధాని కావడంలో చంద్రబాబు నాయుడే కీలకపాత్ర పోషించారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బెంగళూరులోని ప్రాంతీయ భాషా ఉద్యమ కారులు ఆందోళనలు చేపట్టారు. తెలుగువాళ్లు లేకపోతే, కన్నడవాళ్లు పరిపాలన సాగించలేరా..? అంటూ మండిపడ్డా రు. ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మె ల్యే క్షమాపణలు చెప్పారు. తాజాగా చైన్నెకి చెందిన పలువురు న్యాయవాదులు, విద్యార్థులు సైతం గురజాల జగన్‌మోహన్ నాయుడుపై చైన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. వెంటనే ఆయన చైన్నెకి వచ్చి తమిళులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 78,561 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,361 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


