జిల్లాలో 12,04,067 మంది ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 12,04,067 మంది ఓటర్లు

Aug 1 2026 12:52 AM | Updated on Aug 1 2026 12:52 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ఓటర్ల జాబితా పారదర్శకతకు పార్టీలు సహకరించాలని డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వెల్లడించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ఎస్‌ఐర్‌ ప్రక్రియలో జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వెల్లడించారు. మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 12,04,067 మంది వివరాలను డిజిటలైజ్‌ చేసినట్లు వివరించారు. జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఆగస్టు 30 వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. విచారణ పూర్తి చేసే గడువు సెప్టెంబర్‌ 28, తుది ఓటర్ల జాబితా ప్రచురణ అక్టోబర్‌ 3 వ తేదీ వరకు ఉంటుందన్నారు. అన్‌న్‌కలెక్టబుల్‌గా గుర్తించిన 1,36,059 పేర్లను తొలగించామని వెల్లడించారు.గడువులోగా మ్యాపింగ్‌ చేసుకోని 23,881 మంది ఓటర్లకు, అలాగే తార్కిక దోషాలున్న 1,10,205 మందికి శుక్రవారం నుంచి నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేత విజయసింహారెడ్డి, ఉదయ్‌కుమార్‌, టీడీపీ నేతసురేంద్ర, బీజేపీ నేత అట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement