సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7లో మళ్లీ అకార్డ్‌ స్కూల్‌దే ఆధిపత్యం | - | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7లో మళ్లీ అకార్డ్‌ స్కూల్‌దే ఆధిపత్యం

Aug 1 2026 12:52 AM | Updated on Aug 1 2026 12:52 AM

తిరుపతి రూరల్‌: సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 అథ్లెటిక్స్‌ మీట్‌–2026లో తిరుపతికి చెందిన అకార్డ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ మరోసారి సత్తా చాటుకుంది హైదరాబాదులోని మల్లారెడ్డి ఫౌండేషన్‌ స్కూల్‌ ఆవరణలో జరిగిన సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 అథ్లెటిక్స్‌ మీట్‌ – 2026లో అకార్డ్‌ స్కూల్‌ విద్యార్థులు ఓవరాల్‌ చాపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. మొత్తం 39 పతకాలు సాధించారు. వీటిలో 33 స్వర్ణ, మూడు రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయని పాఠశాల ప్రిన్సిపల్‌ నీరజారెడ్డి తెలిపారు. అలాగే 168 చాపియన్‌షిప్‌ పాయింట్లు సాధించి, గత పదేళ్లలో ఏ పాఠశాల నమోదు చేయని అత్యధిక స్కోరును నమోదు చేస్తూ కొత్త రికార్డు సృష్టించినట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు విజేతలను అకార్డ్‌ స్కూల్‌ డైరెక్టర్లు ప్రశాంత్‌ రెడ్డి, వివేక్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement