నగరి : భోగాపురం అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం విష యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహ జ నైజం ప్రకారం క్రెడి ట్ చోరీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. శుక్రవారం నగరిలో ఆమె మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు భోగాపురం విమానాశ్రయానికి హడావుడిగా శంకుస్థాపన చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. అస లు ప్రాజెక్టు నిర్మాణ పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగాయని స్పష్టం చేశారు. జగనన్న తీసుకువచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైందని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా అదే జరుగుతోందని విమర్శించారు.
ఉద్యోగ భద్రతే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతే లక్ష్యంగా పోరాటం సాగిస్తున్నామని స్కీమ్ వర్కర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గంగరాజు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతు న్నా చంద్రబాబు ప్రభు త్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీలా మాట్లాడుతూ పనిభారం పెంచే నవచేతన యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందించారు.


