భక్తుల వినూత్న మొక్కులు | - | Sakshi
Sakshi News home page

భక్తుల వినూత్న మొక్కులు

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

● వానగుట్టపల్లిలో ఘనంగా కావళ్ల పండగ

భక్తులతో కిటకిటలాడిన సుబ్రమణ్య స్వామి

ఆలయం

కుప్పం: మండలంలోని వానగుట్టపల్లిలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆడిమాసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా ఆడిమాసంలో భక్తులు కావళ్లు చెల్లిస్తారు. ఈ ఏడాది భక్తులు శరీరానికి శూలాలు గుచ్చుకుని ఎస్సార్ట్‌ వాహనంలో విన్యాశాలు చేశారు. సైకిల్‌ చక్రం తరహాలో ఒక భక్తుడు శరీరానికి శూలాలు గుచ్చుకున్నాడు. కొందరు నోటిలోనూ శూలాలు గుచ్చుకున్నారు. వీటిని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో హారోం హర నామ స్మరణతో వానగుట్టపల్లి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement