● కాణిపాకంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

● కాణిపాకంలో భక్తుల రద్దీ

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

● కాణిపాకంలో భక్తుల రద్దీ ● భక్తిశ్రద్ధలతో సంకటహర గణపతి వ్రతం

కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఆస్థాన మండపంలో ఆదివారం సంకటహర గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో నాలుగు బ్యాచ్‌లుగా వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి స్వామి వారిని స్వర్ణ రథంలో ఊరేగించారు. ఈ క్రమంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. – కాణిపాకం

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

– కాణిపాకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement