ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో మంచి నాణ్యమైన 26 కేజీల బియ్యం బస్తా రూ.1,200లకు (కిలో సగటున రూ.46) లభిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో సూపర్‌ఫైన్, స్టీమ్, సోనామసూరి రకాల బియ్యం కిలో రూ. 52 చొప్పున, రా బియ్యం కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్టు ప్రకటించారు. బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లోనే ధరలు ఎక్కువగా ఉండడం ఏమిటని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ కేంద్రాలను, ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి ధరలకు .. బయట ధరలకు వ్యతాసం కనిపిస్తోంది.


