– 8లో
నగరిలో అతివేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు.
ఆర్‌ఎంపీలపై
నిఘా పెంచాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో అనధికారిక వైద్య సేవలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రయోగశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో సోమవారం డమ్మీ వైద్యం దందా శీర్షికన కథనం వెలువడింది. దీనిపై ఆయన స్పందించారు. వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వైద్యాధికారి తమ పరిధిలోని ఆర్‌ఎంపీల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని, సైలెన్లు, ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇవ్వకుండా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో నిఘా పెట్టనున్నట్టు తెలిపారు. సంజీవిని–కేసీడీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ఈ నెల 10వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్, వైద్యాధికారులు ప్రవీణ్, గిరి, అనూష, జార్జ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


