ఆలయ కుంబాభిషేకంలో పెద్దిరెడ్డి దంపతులు | - | Sakshi
Sakshi News home page

ఆలయ కుంబాభిషేకంలో పెద్దిరెడ్డి దంపతులు

Aug 4 2026 2:17 AM | Updated on Aug 4 2026 2:17 AM

బంగారుపాళెం : మండలంలోని పాలేరు గ్రామంలో సోమవారం శ్రీకనకాద్రి కై లాసేశ్వర దేవాలయ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత పాల్గొన్నారు. వారికి ఆలయ నిర్మాణకర్తలు విశ్రాంత ప్రొఫెసర్‌ చెంగల్‌రెడ్డి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి దంపతులు స్పటిక శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. అదే విదంగా స్వామి వారిని మాజీ ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ సునీల్‌కుమార్‌, లలితకుమారి, మాజీ ఆర్టీసీ ఉపాధ్యక్షులు విజయానందరెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్‌ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement