లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే!

Aug 4 2026 2:17 AM | Updated on Aug 4 2026 2:17 AM

డీఎస్సీలో జరిగిన తప్పిదాలపై సీబీఐ విచారణ చేయించాలి 6 నుంచి 10వతేదీ వరకు వైఎస్సార్‌ సీపీ నిరసన కార్యక్రమాలు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి

రాజీనామా చేసేంత వరకు పోరాటం

కార్వేటినగరం: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీకి బాధ్యత వహించిన ఽకేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్లు డీఎస్సీ నియామకాల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. పుత్తూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్యర్యంలో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ నాయకుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన డీఎస్సీలో అర్హులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముసుగులో నారాలోకేష్‌ దాదాపు 16 వేల టీచర్‌ పోస్టుల్ని ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. స్పోర్ట్స్‌ లో పాల్గొనని, ఏ పతకం సాధించని వారిని దొంగ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్‌ కోటా కింద టీచర్‌ పోస్టులు ఇచ్చారని విమర్వించారు. నారా లోకేష్‌ తోడల్లుడు, ఎంపీ భరత్‌, ఆముదాలవలస ఎమ్మెల్యే పూర్ణరవికుమార్‌ సాఫ్ట్‌బాల్‌ డ్యూరేకి ఒక క్రీడా సంఘాన్ని ఏర్పాటు చేసి అనర్హులైన 29 మందికి ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. డీఎస్సీ దందాపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న భూమన కరుణాకరరెడ్డి

సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు

నీట్‌ పరీక్షల్లో జరిగిన తప్పులపై యువత రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు పోరాటం చేశారని, అదే తరహాలో రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాల్లో జరిగిన అన్యాయానికి కారుకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేసేంత వరకు పోరాటం చేస్తామని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోను నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలు అధిక సంఖ్యలో తరలివచ్చి అధికారపార్టీ మెడలు వంచి న్యాయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు 6వ తేదీ నుంచి 9వరకు నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. 10వ తేదీ నియోజకవర్గం స్థాయిలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరీశీలకులు వల్లివేడు పృథ్విరెడ్డి, మండల కన్వీనర్లు శేఖర్‌రాజు, పద్మనాభరెడ్డి, మణి, వెంకటరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సుకుమార్‌, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి, హేమసుందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూదిమోహన్‌, మాజీ మండల కన్వీనర్‌ ధనుంజయవర్మ, వెంకటేష్‌రెడ్డి, మధివన్నన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement