పే ట్యాక్స్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పే ట్యాక్స్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

చిత్తూరు అర్బన్‌: ఇటీవల ప్రజలను మోసం చేస్తూ ‘పే ట్యాక్స్‌’ పేరిట వస్తున్న ఏపీకే ఫైల్స్‌ ను ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడీ ఓ ప్రకటనలో కోరారు. కొందరు సైబర్‌ నేరగాళ్లు పేట్యాక్స్‌, ఇన్‌కం ట్యాక్స్‌ పెండింగ్‌, ట్యాక్స్‌ పెండింగ్‌, ఈ–వెరిఫికేషన్‌, పెనాల్టీ నోటీస్‌ పేరిట తప్పుడు ఎస్‌ఎంఎస్‌లు, ఏపీకే ఫైళ్లను షేర్‌ చేస్తున్నారని తెలిపారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ శాఖల లోగోలు చూసి నగదు చెల్లించొద్దని తెలిపారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే డయల్‌–1930, డయల్‌–112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement