వర్షాల కోసం విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం విశేష పూజలు

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

కాణిపాకం : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మణికంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో వరుణయాగం, సహస్ర ఘటాభిషేకం, విశేష పారాయణాలు చేపట్టారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఆనందంతో తులతూగాలని యజ్ఞక్రతువును శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. ఈఓ పెంచల కిషోర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మణి నాయుడు, సభ్యు లు అనసూయ, కృష్ణవేణి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్‌ రవి పాల్గొన్నారు.

మన చేతిలోనే మన ఆరోగ్యం

వి.కోట : ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అందరి జీవితాల్లోకి తీసుకురావాలన్నదే ప్రధాన ధ్యే యమని మిల్లెట్‌మన్‌ డాక్టర్‌ ఖాదర్‌వలీ తెలిపారు. సోమవారం స్థానిక విద్యానికేతన్‌ కాలే జీ ఆవరణలో లయన్స్‌ క్లబ్‌ వారి ఆధ్వర్యంలో ఖాదర్‌వలీ ఉపన్యాసం చేపట్టారు. ఖాదర్‌వలీ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందని, స్థానిక పంటలను ప్రోత్సహించా లని, చిరుధాన్యాలను ఆహారంగా ప్రతి ఒక్క రూ తీసుకోవాలని సూచించారు. కొర్రలు, సా మలు,అరికెలు, ఊదలు, అండుకొర్రలు, రాగు లు, జొన్నలను తీసుకోవాలని కోరారు. వీటిలో పీజు పదార్ధారాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని వెల్లడించారు.

జిల్లా మలేరియా అధికారిగా అనిల్‌ కుమార్‌

చిత్తూరు రూరల్‌(కాణిపాకం) : జిల్లా మలేరి యా అధికారిగా కె.అనిల్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఎంహెచ్‌ఓ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా సర్వేలెన్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఈ బా ధ్యతలతో పాటు డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్‌ అధికారాలను కూడా బదిలీ చేశారు. ఇప్పటివరకు మలేరియా అధికారిగా ఉన్న నవీన్‌ తేజ్‌ రాయల్‌ అన్నమయ్య జిల్లా లద్ధిగం పీహెచ్‌సీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

15లోపు వంట గ్యాస్‌కు ఈకేవైసీ తప్పనిసరి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఎల్పీజీ వంట గ్యాస్‌ వినియోగదారులు ఈ నెల 15వ తేదీలోపు ఈకేవైసీని (బయోమెట్రిక్‌ ధ్రువీకరణ) తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ వెల్లడించారు. సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్‌ కనెక్షన్లు దుర్వినియోగం కాకుండా చూడడంతో పాటు, అర్హులైన వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా గ్యాస్‌ సిలిండర్ల సరఫరా చేయాలన్నదే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వివరించారు. నిర్ణీత గడువులోపు ఈకేవైసీ చేయించుకోని వినియోగదారుల గ్యాస్‌ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయాల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. సిలిండర్‌ సరఫరా కోసం ఇంటి వద్దకు వచ్చే డెలివరీ బాయ్స్‌ ద్వారా కూడా బయోమెట్రిక్‌ యంత్రాల సహాయంతో సులభంగా ఈకేవైసీ చేయించుకోవచ్చని వెల్లడించారు.

రోయింగ్‌ పోటీల్లో

విద్యార్థి ప్రతిభ

చిత్తూరు కలెక్టరేట్‌: జాతీయ స్థాయి రోయింగ్‌ పోటీలలో జీడీ నెల్లూరు మండలం పాచిగుంటకు చెందిన తనీ ష్‌ స్వర్ణ పతకం సాధించారు. 14 ఏళ్ల తనీష్‌ పూణే లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (ఖడ్కీ)లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 5 నుంచి 9 వరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా రవీంద్ర సరోబర్‌ లేక్‌లో 27వ సబ్‌–జూనియర్‌ నేషనల్‌ రోయింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు పెట్టారు. ఇందులో తనీష్‌ బృందం మణిపూర్‌ బృందంపై గెలిచి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement