నేడు కుప్పంలో ఎస్టీ కమిషన్‌ సభ్యుడి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు కుప్పంలో ఎస్టీ కమిషన్‌ సభ్యుడి పర్యటన

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

చిత్తూరు కలెక్టరేట్‌: రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వెంకటప్ప మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు కుప్పంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. స్థానిక వాల్మీకి కల్యాణ మండపంలో నిర్వహించనున్న సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. గిరిజనుల వినతులు స్వీకరించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు కుప్పం నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం బయలుదేరి వెళతారని వివరించారు.

వైభవంగా ప్రదోషకాల పూజలు

కాణిపాకం: స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అనుబంధమైన శ్రీమణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో సోమ వా రం సాయంత్రం ప్రదోషకాల పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ప్రదోష వేళ నందీశ్వర స్వామివారికి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేపట్టారు. అనంతరం నందీశ్వరుడిని వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement