పరిశీలించి.. పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పరిశీలించి.. పరిష్కారం

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

● ఎస్‌ఆర్‌పురంలో గ్రీవెన్స్‌కు హాజరైన కలెక్టర్‌ ● వివిధ సమస్యలతో పోటెత్తిన అర్జీదారులు ● భూ అక్రమణలను అడ్డుకోండి : పాతపాళ్యం దళితవాడకు దారి పోకుండా ఇరిగేషన్‌ కాలువను ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మండలంలోని భూములు, చెరువుల, కాలువులు కబ్జాకోరల్లో చిక్కుకుంటున్నాయని వెల్లడించారు. కలెక్టర్‌ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఇంటి స్థలం మంజూరు చేయండి : ఒంటరి మహిళను ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నానని, ఇంటి స్థలం మంజూరు చేయాలని మెదవాడ ఎస్టీ గ్రామానికి చెందిన ఎస్‌,కస్తూరి కోరింది. అలాగే ఒంటరి మహిళ పింఛను ఇప్పించాలని విన్నవించింది. ఈ మేరకు కలెక్టర్‌కు అర్జీ సమర్పించింది. ● భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు : శ్రీరంగరాజపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 336/1,337/2లో తమకు 2.37 భూమి ఉందని మెదవాడ గ్రామానికి చెందిన లక్ష్మి తెలిపింది. అయితే తమ భూమి ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదని వెల్లడించింది. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించింది. ● ఆస్పత్రిలో మందులు లేవు : 2వ తరగతి చదువుతున్న తమ కుమారుడు నరేష్‌కు అనారోగ్యం కారణంగా పీహెచ్‌సీకి తీసుకెళితే మందులు లేవని క్షీర సముద్రం గ్రామానికి చెందిన విద్యార్థి నరేష్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మందుల కొరత తీర్చాలని కోరారు. ● పింఛన్‌ మంజూరు చేయండి : సదరం సర్టిఫికెట్‌లో 92 శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ పింఛన్‌ మంజూరు చేయడం లేదని కటికపల్లెకు చెందిన శేఖర్‌ విన్నవించాడు. భార్య, తలిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్నారని, పోషణ కష్టంగా ఉందని వినతిలో పేర్కొన్నాడు. ● వెంటనే స్పందించండి : ప్రజలు నుంచి వచ్చిన అర్జీలపై వెంటనే స్పందించాలని, ఆలస్యం చే యకుండా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టా లని కలెక్టర్‌ ఆదేశించారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే థామస్‌తో కలిసి లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, డీఆర్‌ఓ మోహన్‌, ట్రైనీ కలెక్టర్‌ వెంకటేష్‌, చిత్తూరు ఆర్‌డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.

పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్నానని ప్రభుత్వం ఉచితంగా అందించే బ్యాటరీ సైకిల్‌ ఇప్పించాలని ముద్దుకుప్పం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రామ్‌రాజ్‌ కోరాడు. సదరం సర్టిఫికెట్‌లో తన కంటే తక్కువ శాతం వైకల్యం ఉన్నవారికి కూడా సైకిల్‌ ఇచ్చారని ఆరోపించాడు. కలెక్టర్‌ స్పందించి బ్యాటరీ సైకిల్‌ మంజూరు చేయాలని విన్నవించాడు.

శ్రీరంగరాజపురం : ఎస్‌ఆర్‌పురం మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌)కు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే థామస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. జిల్లా అధికారులకు వినతులు సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ స్పందిస్తూ అన్ని వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.

అందుబాటులో ‘క్యూఆర్‌ కోడ్‌’

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఆయన సోమవారం ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారిక వెబ్‌సైట్‌ www.meekosam.ap.gov.inలో నేరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి, ఇతర వివరాల కోసం 1100 కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ప్రజల అభిప్రాయాలను నేరుగా సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో ప్రదర్శించిన ‘సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌’ను స్కాన్‌ చేసి అర్జీదారులు తమ ఫిర్యాదు పరిష్కారంపై ఫీడ్‌బ్యాక్‌ నమోదు చేయవచ్చని వివరించారు.

బ్యాటరీ సైకిల్‌ కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement