అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

అడ్డంకులు

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

● చిత్తూరులో గంగినేనిచెరువు నుంచి ఆర్‌డీ ఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలి సి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ర్యాలీ నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు మాజీ ఎంపీ రెడ్డెప్పతో కలిసి ఉదయం 9.30 గంటలకు చెరువుకట్ట వద్దకు చేరుకున్నారు. అప్పటికే ముందస్తు ప్రణాళికతో అక్కడకు చేరిన పోలీసులు ర్యాలీకి అనుమతి లేదన్నారు. అందరూ వెనక్కు తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని, నిబంధనలను ఉల్లంఘించమని విజయానందరెడ్డి స్పష్టం చేసినా.. ఖాకీలు వినిపించుకోలేదు. విజయానందరెడ్డితోపాలు మహిళలు, కార్యకర్తలను బలవంతంగా వ్యానులోకి ఎక్కించుకుని టూటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. దాదాపు మూడు గంటల పాటు స్టేషన్‌లో కూర్చోపెట్టారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని విజయానందరెడ్డితోపాటు మరో ఆరుగురిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ● కుప్పంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డుకోవడానికి పోటీగా టీడీపీ నేతలు సైతం ర్యాలీకి పిలుపునిచ్చారు. బయలుదేరడానికి సన్నద్ధమైన ఎమ్మెల్సీ భరత్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే.. రెచ్చిపోయిన పచ్చ మూక ఎమ్మెల్సీ ఇంటిపై పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించారు. అసలు కుప్పంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తే కనిపించకూడదని హుకుం జారీ చేశారు. ● పలమనేరులో సమన్వయకర్త వెంకటేగౌడ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ ఉవ్వెత్తున ఎగసింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ఆంక్షలు విధించినా, కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోలేదు. ● గంగాధరనెల్లూరులో ర్యాలీకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అ డ్డుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో నాయకులను వదలిపెట్టి పోలీసులు వెళ్లిపోయారు. ఖాకీ తీరుపై నారాయణస్వా మి, కృపాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ● పూతలపట్టులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు శత విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. జన బలం ముందు పోలీసులు తలవంచక తప్పలేదు. అనంతరం నేతలు డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు.

అడుగడుగునా

పలమనేరులో చేపట్టిన ర్యాలీకి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు

చిత్తూరు అర్బన్‌ : డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతియుత ర్యాలీలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారపార్టీ నేతలు చెప్పిందే వేదంగా.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేశారు. పోస్టింగులు కాపాడుకోవడానికి కొందరు., స్వామి భక్తి నిరూపించుకోవడానికి మరికొందరు పోటీ పడ్డారు. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపాలని చూసి నవ్వులపాలయ్యారు. నాయకులను అరెస్టుచేస్తే కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ పోలీసుల నీతిమాలిన చర్యను రోడ్డుపైనే కడిగేశారు. పోలీసులు ర్యాలీలైతే అడ్డుకున్నారు కానీ, ప్రజల్లో వెళ్లాల్సిన వాస్తవాలను మాత్రం దాచలేకపోయారు. ప్రతిపక్షం గొంతుకను నొక్కలేకపోయారు.

పోలీసులు తరలిస్తున్న వాహనం నుంచి అభివాదం చేస్తున్న నారాయణస్వామి

చిత్తూరులో విజయానందరెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీలపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement