చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగర శివారులోని పూనేపల్లి మంగలోళ్ల గుట్టలో శుక్రవారం ఒక గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో సంఘటన దాదాపు 10 రోజుల క్రితం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో చిత్తూరు తాలూకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమా ర్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.
టీషర్ట్‌పై ఆధారాలు..
తమిళనాడు వ్యక్తిగా అనుమానం
మృతుడు ధరించిన స్పోట్స్ టీషర్ట్ వెనుక భాగంలో రాజేష్ అనే పేరుతో పా టు 888 అనే నంబర్ ముద్రించి ఉంది. ఈ ఆధారాల బట్టి మృతు డు పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న తాలూకా పోలీసులు మృతుడి పూర్తి వివరాల కోసం దర్యాప్తును వేగవంతం చేశారు.
ఎద్దులగట్టులో
బీహార్ వాసి మృతి
రామకుప్పం(శాంతిపురం): రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీలోని ఎద్దులగట్టు గ్రామంలో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. బీహార్‌కు చెందిన కిశోర్ గత తొమ్మిది సంవత్సరాలుగా స్థానికంగా ఓ సెంట్రింగ్ మేసీ్త్ర వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న కిషోర్‌ను గమనించిన యజమాని ఆస్పత్రికి తరలిస్తుంటే మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి అతిగా మద్యం సేవించడం వల్లే ఈ మరణం సంభవించి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒంటరిగా ఉన్న కిశోర్ చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు ఎవరికీ తెలియకపోవటంతో ఎద్దులగట్టు వద్దే అతని మృతదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.
అందరి సూచనలతో ఆలయ అభివృద్ధి
కుప్పం: శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయాన్ని భక్తులు, ప్రజలు, అర్చకులు, వేద పండితులు సూచనలు, సలహాల మేరకు అభివృద్ధి చేస్తామని ఆలయ ఈఏ రమణ శుక్రవారం తెలిపారు. గంగమ్మ దేవాలయంలో రాజకీయం అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిచాంరు. ఆలయ అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజకీయం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఆలయ పునః నిర్మాణం, గర్భగుడి అభివృద్ధి, ఏదైనా ప్రధాన మార్పులకు సంబంధించి అందరి సలహాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గర్భగుడి మార్పునకు సంబంధిం ఏలాంటి ప్లాన్‌లు దేవాదాయ శాఖ ఆమోదం పొందలేదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కోడిపందేల స్థావరంపై దాడి
– ముగ్గురు అరెస్ట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండల పరిధిలోని తుమ్మింద గ్రామ సమీప గుట్టల్లో శుక్రవారం నిర్వహించిన కోడిపందేల స్థావరంపై తాలూకా పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ముగ్గురు పందెంరాయుళ్లను అరెస్ట్‌చేయగా, పలువురు పారిపోయారు. పోలీసుల కథనం మేరకు.. తుమ్మింద గ్రామ సమీపంలోని గుట్టల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో తాలూకా పోలీసులు స్థావరంపై మెరుపు దాడులుచేశారు. ఈ దాడిలో తమిళనాడులోని కళ్లత్తూరుకు చెందిన రామచంద్రన్, బంగారుపాళ్యానికి చెందిన ఏకాంబరం, మాపాక్షికి చెందిన హేమచంద్రన్ పట్టుబడ్డారు. పందెం స్థావరం వద్ద నుంచి నాలుగు పందెం కోళ్లు, రూ.4,200 నగదుతో పాటు పందెంరాయుళ్లకు చెందిన 24 ద్విచక్రవాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో జరిగే పందెల కోసం చిత్తూరు, యాదమరి, బంగారుపాళ్యంతో పాటు తమిళనాడు నుంచి అధికంగా తరలివస్తున్నట్లు సమాచారం. పరారైన మిగిలిన పందెం రాయుళ్ల కోసం చర్యలు చేపట్టినట్లు తాలూకా ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో బీఎన్‌ఆర్‌పేట ఎస్‌ఐ మణికంఠేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


