చిత్తూరు కలెక్టరేట్ : ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 9వ తేదీ ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని గిరిజనులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాసంఘాల సభ్యులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
టైరు మారుస్తుండగా
గుండెపోటు!
– టెంపో డ్రైవర్ మృతి
బంగారుపాళెం: బంగారుపాళెం మండలంలోని కేజీ సత్రం వద్ద గురు వారం జాతీయ రహదారిపై గుండెపోటుకు గురై టెంపో డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు పట్ట ణం మిట్టూరుకు చెందిన రాజేంద్ర(60) టెంపో వాహనంలో పలమనేరు నుంచి చిత్తూరుకు వెళుతున్నాడు. కేజీ సత్రం వద్ద టైర్ పంక్చర్ అయ్యింది. టైరు మార్చేందుకు జాకీరాడ్‌ను తిప్పుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను టైంపో కింద పడిపోయాడు. స్థానికులు గుర్తించి అక్కడికి వెళ్లే సరికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


