● సర్వే చేయకనే చేసినట్టు చూపారే? ● బాధిత రైతు రెడ్డెప్ప రెడ్డి ఆవేదన
పలమనేరు: తన పట్టా భూమిని చట్టు పక్కల రైతులు ఆక్రమించారని ఆ భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. గంగవరం రెవి న్యూ అధికారులు తన భూమి సర్వే చేసినట్టు తనకు ఎండార్స్‌మెంట్ పంపారని తనకు తెలియకుండానే ఎలా సర్వే చేశారో దిక్కు తోచడం లేదని అదే మండలం పాతకీలపట్లకు చెందిన రెడ్డెప్పరెడ్డి శనివారం ఆర్‌డీవో కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. తన భార్య చంద్రమ్మ పేరిట కీలపట్లలో సర్వే నెం:55/2బీలో 99 సెంట్లు పట్టాభూమి ఉందన్నారు. దీన్ని నలువైపులా ఉన్న రైతులు 20 సెంట్ల దాకా ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. దీనిపై తనకు న్యాయం చేయాలని గత నెల 20న పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు చేశానన్నారు. కానీ తన భూమిని సర్వే చేయకనే తనకు ఎండార్స్‌మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాతలకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు దాతలను ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. యాప్ ను మెగా పీటీఎం రోజున అధికారికంగా విడుదల చేసినట్లు చెప్పారు. మౌలిక వసతుల సమస్యలున్న ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఇందుకు దాతల సహకారం తీసుకునేందుకు ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిపారు. మౌళిక సదుపాయాల వివరాలు schoolinfra. ap. gov. in/ donations పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఆ వివరాల ఆధారంగా అదన పు తరగతి గదులు, వంటగది, కళా వేదిక, ఇతర సదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వొచ్చన్నా రు. కనీసం రూ.వెయ్యి నుంచి తోచినంత మొ త్తం సాయం చేయవచ్చని తెలిపారు. వస్తువుల రూపంలో సైతరం వితరణ చేయవచ్చన్నారు.


