హాజరు.. బేజారు! | - | Sakshi
Sakshi News home page

హాజరు.. బేజారు!

Aug 2 2026 1:28 AM | Updated on Aug 2 2026 1:28 AM

అటెండెన్స్‌ వెనుక అసలు ముఖచిత్రం నత్తనడకన ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు ప్రక్రియ అవకతవకలు తెలుస్తాయని ఆలస్యం బీఈడీ, డిగ్రీ కళాశాలల్లో నామమాత్రపు నమోదు పర్యవేక్షణలో అధికారుల ఉదాసీనత

చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా

ప్రకటిస్తుంది. ఏదేదో చేసేస్తామని అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. కార్యాచరణలో మాత్రం తూతూమంత్రంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఉన్నత విద్యారంగంలో వందశాతం హాజరును నిర్ధారించేందుకు ఫేషియల్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను అమలులోకి తీసుకువచ్చింది. అయితే నమోదు ప్రక్రియలో మాత్రం తడబడుతోంది.

నిర్దేశిత గడువులోపు యాభై శాతం కూడా పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదనే విమర్శ వినిపిస్తోంది.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉన్నత విద్యారంగంలో నిజమై న హాజరును నిర్ధారించేందుకు చంద్రబాబు ప్రభు త్వం ఆర్భాటంగా ఫేషియల్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) తీసుకువచ్చింది. అయి తే ఈ విధానం సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో నే వెనుకపడింది. క్షేత్రస్థాయిలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమో దు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీని వెనుక ప్రైవే ట్‌ విద్యాసంస్థల వ్యూహాత్మక నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ఆగస్టు 10వ తేదీ తుది గడువు. అయితే అప్పటిలోగా ప్రక్రియ సగం కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

ప్రైవేట్‌ అలసత్వం

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో దాదాపు 1,500 మంది వరకు విద్యార్థులు ఉన్నా రు. ఆ కళాశాల యాజమాన్యం ఇప్పటివరకు ఒక్కరినీ కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌లో ఎన్‌రోల్‌ చేయలేదు. అలాగే కుప్పం పరిధిలోని ఓ డిగ్రీ కళాశాలలో 200 మంది అడ్మిషన్లు పొందినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఒక్కరూ ఎఫ్‌ఆర్‌ఎస్‌లో ఎన్‌న్‌రోల్‌ కాలేదు. పలమనేరు లోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలోనూ 500 మంది విద్యార్థులకుగాను 70 మందిని మాత్ర మే యాప్‌లో నమోదు చేశారు.

ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియకు సంబంధించి ఏయే కశాశా లలో ఎంతమేర ఎన్‌ రోల్‌మెంట్‌ జరిగిందనే వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలకు సంబంధించి ఎన్‌న్‌రోల్‌మెంట్‌ 20 శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం.

బీఈడీ, డీఈడీలో సున్నా నమోదు

జిల్లాలోని 7 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉండగా, వాటి లో 600 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు ఒక్క విద్యార్థి వివరాలు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. సాధారణంగానే బీఈడీ, డీఈడీలోనే హాజరు శాతం తక్కువ. వందలాది మంది విద్యార్థులను చూపుతున్న ప్రైవే ట్‌ యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో వివరాలను నమో దు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి. కొందరు వచ్చే ఏడా ది నమోదు చేద్దామనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

బోగస్‌..బయటపడుతుందనే..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 42 డిగ్రీ కళాశాలల్లో 24 వేల మంది విద్యార్థులు అడ్మిషన్‌ పొందారు. పలు కళాశాలల్లో విద్యార్థులు రాకపోయినా రికార్డుల్లో పూర్తి హాజరు చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేస్తే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి యాప్‌లో హాజ రు వేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిస్థాయిలో అమలైతే బోగస్‌ హాజరు గుట్టు రట్టువుతుంది. విద్యార్థుల హాజరు తగ్గిపోతే ఫీజ్‌ రియింబర్స్‌మెంట్‌ లబ్ధి దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే ఆయా సంస్థలు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement