చిత్తూరు అర్బన్: హైవే దాబాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల సాక్షి దినపత్రికలో అదాబ్బా సంగతి అనే పేరిట ప్రచురితమైన కథనానికి డీఎస్పీ జె.వెంకటనారాయణ స్పందించారు. బుధవారం ఈ మేరకు చిత్తూరులోని పోలీస్ గెస్ట్ హౌస్‌లో దాబా యజమానులతో సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి దాబాలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కనీసం 30 రోజుల ఫుటేజీని భద్రపరచాలని సూచించారు. దాబా పరిసరాలు, పార్కింగ్, వాష్‌రూమ్‌ల వద్ద తగినంత వెలుతురు ఉండాలని, పనిచేసే సిబ్బంది ఆధార్‌తో సహా పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. గంజాయి, మద్యం, జూదం, వ్యభిచారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశమిస్తే దాబా యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే112 నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, ఈస్ట్ సీఐ రామచంద్ర, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు పాల్గొన్నారు.


