● కుప్పం ప్రాంతానికి చెందిన
ఒకరు మృతి
కుప్పం రూరల్: తమిళనాడులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్పం ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందా రు. 15 మంది గాయపడ్డారు. బాధితుల బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. సోమవారం ఆడిపదినెట్టి పర్వదినం కావ డంతో కుప్పం మండలం మోట్లచేను గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది భక్తులు తమిళనాడు రాష్ట్రం తీర్థకొండ సుబ్రమణ్యస్వామివారి ఆలయానికి ఉదయం బయ లుదేరారు. స్వామివారిని దర్శించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో తిరుపత్తూరు జిల్లా మరకుప్పం వద్దకు రాగానే ఎదురుగా మినీ బస్సు వచ్చి టాటా పికప్ వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో కుప్పం భక్తులు 15 మంది త్రీవంగా గాయపడ్డారు. వారిలో మదన్(28) అక్కడిక్కడే మృతిచెందాడు. పెద్దపాప, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, చెల్లమ్మ, మల్లమ్మ, జయంతి, శివశంకర్, దేవరాజు, చెంగొటమ్మ, సత్య, సంధ్య, శిరీ, సతీష్, రాజప్పతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానికులు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో శివశంకర్, పెద్దపాప, వెంకటలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలియగానే మోట్లచేను గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టాటా పికప్ వాహన డ్రైవర్ వెంకటేష్ ఉతంగరి పోలీసుల అదుపులో ఉన్నాడు.


