ఆరోపణలు మాని అభివృద్ధి చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆరోపణలు మాని అభివృద్ధి చేయండి

Aug 4 2026 2:17 AM | Updated on Aug 4 2026 2:17 AM

● దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయండి ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

కార్వేటినగరం: ప్రభుత్వం ప్రతిపక్షంపై ఆరోపణలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం మాని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆయన సోమవారం పుత్తూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందన్నారు. అవినీతి పెచ్చుమీరిందని, దీనిపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కూటమి నేతలు గుట్టలు, కొండలు, వాగులు, వంకలను దోచుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రిగా ఎన్ని మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చావు. ఎన్ని కళాశాలలు నిర్మాణం చేశావు. ఎంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చావు.. ఎంతమంది రైతులను ఆదుకున్నావు’’ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఏ నాయకుడూ నాణ్యమైన మద్యం ఇస్తా అని ఓటు అడగలేదని, చంద్రబాబు ఒక్కరే మద్యం ఇస్తానని ప్రకటించాడన్నారు. నీట్‌ పరీక్షల్లో జరిగిన అవకతవకలతో 21 మంది విద్యార్థులు మృతి చెందితే చంద్రబాబు మాట్లాడకపోవడం దారు ణమన్నారు. ముద్రగడ పద్మనాభం, వంగవీటి రంగా కాపుల కోసం పోరాడిన వ్యక్తులని గుర్తు చేశారు. సినిమాను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ కాపుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాపులను కాల్చిబూడిద చేసినా, దాడు లు చేసినా పవన్‌ కళ్యాణ్‌ నోరు విప్పడం లేదని విమర్శించారు.

ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చెయ్‌

2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారని, దేశంలో ఎన్నడూ చేయలేని సంక్షేమ పథకాలను అమలు చేశారని నారాయణస్వామి గుర్తు చేశారు. జగనన్నపై బురద చల్లడం మాని, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నిక ల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రడ్డి అధికారంలోకి వచ్చాక పేద వాడి తలరాతలు మారా యని తెలిపారు. నేడు చంద్రబాబు హయాంలో పేదవాడికి సంక్షేమం అందిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాల కన్వీనర్లు శేఖర్‌రాజు, పద్మనాభరెడ్డి, మణి, వెంకట్‌రెడ్డి, విజయకుమార్‌రెడ్డి, వళ్లివేడు పృథ్వీరెడ్డి, జెడ్పీటీసీ సుకుమార్‌, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement