గిరిజనులు ఆర్థిక సాధికారత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజనులు ఆర్థిక సాధికారత సాధించాలి

Aug 10 2026 1:40 AM | Updated on Aug 10 2026 1:40 AM

● రానున్న మూడు నెలల్లో గిరిజన హాస్టల్స్‌లో మౌలిక వసతులు ● అటవీ హక్కుల పట్టాలు, పీఎం కిసాన్‌ నిధుల మంజూరుపై ప్రత్యేక దృష్టి ● ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : గిరిజనులు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌కు విద్యార్థులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. గిరిజనులు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు, విద్యుత్‌ దీపాలు, తాగునీరు వంటి మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల ఖాళీలను సమీక్షించి భర్తీ కి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతా ల్లో గుర్తించిన ఆరు ప్రధాన రోడ్ల నిర్మాణానికి నిధు లు మంజూరు చేయిస్తామన్నారు. వచ్చే ఆరు నెల ల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,907 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.6.52 కోట్ల విలువైన పథకాలను అందించామన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌లో 22 మంది గిరిజన రైతులకు 19.99 ఎకరాలకు వ్యక్తి గత పట్టాలు, సామాజిక క్లెయిమ్‌లో 50 మందికి 41 ఎకరాలకు హక్కులు కల్పించామని వివరించారు. అర్హులైన రైతులకు పీఎం కిసాన్‌, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి ఏడాదికి రూ.20 వేల సాయం అందుతోందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని మూడు గిరిజన విద్యాసంస్థల్లో అభివృద్ధి పనులకు రూ.2.64 కోట్లు, ఆర్‌ఓ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.17.7 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గిరిజన విద్యార్థులు ప్రద ర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నా యి. ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్‌, గిరిజన సంఘాల నాయకులు చిరంజీవులు, జీవీ రమణ,రాజశేఖర్‌, రవినాయక్‌, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు మునస్వామి, రాజ్‌కుమార్‌, రఘురాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement