చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్‌న్‌షిప్– 2026 క్రీడా పోటీలు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో బుధవారం రెండో రోజుకు చేరాయి. అండర్–17, అండర్–23 విభాగాల్లో నిర్వహించిన ఖోఖో, వాలీబాల్, పోటీలలో పలు స్కూళ్ల విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో నిర్వహించిన ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్‌భాస్కర్ పర్యవేక్షించారు. ఈ నెల 30న బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, చెస్ పోటీలు, 31న అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


