చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 43 వినతులు అందాయి. సోమవారం చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో చేపట్టిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ఏఎస్పీలు మహబూబ్‌బాషా, షాను హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
బంగారుపాళెం: మండలంలోని టేకుమంద సమీపంలో సోమవారం రాత్రి పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురుని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. పేకాటరాయుళ్ల నుంచి రూ.20,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


