డమ్మీ వైద్యం దందా | - | Sakshi
Sakshi News home page

డమ్మీ వైద్యం దందా

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

● జిల్లాలో పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు ● అమాయకుల ప్రాణాలు పోతున్న వైనం ● కాసులు పిండుకుంటున్న నిర్వాహకులు ● క్షేత్రస్థాయిలో కరువైన తనిఖీలు

జిల్లాలో డమ్మీ క్లినిక్‌లు, అనుమతి లేని దొంగ ఆస్పత్రుల దందా యథేచ్ఛగా సాగుతోంది. వైద్య విద్య అర్హత, ప్రభుత్వ అనుమతి లేకుండా వీధి వీధిలోనూ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఏర్పాటుచేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు బొందపెట్టి దర్జాగా నిర్వహిస్తున్న ఈ డమ్మీ దందాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులు కంటితుడుపు చర్యలైనా తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాణిపాకం: జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోనే అనుమతులు లేని క్లినిక్‌లు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 వరకు అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు నడుస్తున్నట్టు సమాచారం. నగరంలోని పొన్నియమ్మగుడి వీధి, దర్గా సర్కిల్‌, సుందరయ్య వీధి, కొంగారెడ్డిపల్లి, గిరింపేట, ప్రశాంత్‌నగర్‌, మిట్టూరు, గాంధీరోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా డమ్మీ క్లినిక్‌లు విచ్ఛలవిడిగా వెలిశాయి. నగరి, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లోనూ వేలాదిగా అనుమతి లేని ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. ఎలాంటి వైద్య కోర్సులు చదవని వారు ఇక్కడ డాక్టర్ల అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వైద్యం అందిస్తున్నారు.

విచ్ఛలవిడి దోపిడీ

ఈ డమ్మీ సెంటర్లలో రోగుల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా అనుమతి లేని మందులు, హై డోసేజ్‌ మాత్రలను విచ్ఛలవిడిగా విక్రయిస్తున్నారు. చిన్నపాటి రుగ్మతలకు కూడా తీవ్రమైన యాంటీబయోటిక్స్‌ మందులు ఇస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రజ లను భయాందోళనలకు గురిచేసి వేలకు వేలు ఫీజులు గుంజేస్తున్నా రు. జిల్లాలో ఏయే ప్రాంతా ల్లో అనుమతు లు లేకుండా క్లినిక్‌లు నడుపుతున్నారు, ఎవ రు అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారు అనే పక్కా వివరాలు వైద్యారో గ్య శాఖ అధికారుల వద్ద ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకా రం కనీసం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయకపోవడం వెనుక విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాల తో చెలగాటమాడుతున్న ఈ నకిలీ వైద్యులపై తక్షణ మే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం

జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న డమ్మీ క్లినిక్‌లు, ఆస్పత్రుల వివరాలను సేకరిస్తాం. ప్రత్యేక టీమ్‌ల ద్వారా సమగ్ర విచారణ జరిపిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వ్యక్తులు వైద్యం అందించినా, అనుమతి లేకుండా ఆస్పత్రులు నిర్వహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

– నాగశశిభూషణ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement